Saturday, May 4, 2024

INDvsIRE | 18 నుంచి ఐర్లాండ్ తో టీ20 సిరీస్.. భార‌త జ‌ట్టు ఇదే !

వెస్టిండీస్ తో భార‌త్ ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ తర్వాత, జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని టీమ్ ఇండియా ఆగస్టు 18 నుండి ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్ ల T20Iలను ఆడనుంది. ఐర్లాండ్ లోని డబ్లిన్ విలేజ్ స్టేడియం ఈ సిరీస్ కు వేధిక కానుంది. కాగా, ఐర్లాండ్ టూర్ కి వెల్ల‌నున్న భార‌త జ‌ట్టులో బుమ్రాతో పాటు, రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. అలాగే ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ త‌రుపున ఆడిన‌ పేసర్ ప్రసిద్ధ్ 11 నెలల తర్వాత రీఎంట్రీ ఇవ్వ‌నున్నాడు.

ఇక, ఆగస్టు 30 నుండి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023కి ముందు జ‌ర‌గ‌నున్న ఈ సిరీస్ లో బుమ్రా, ప్రసిద్ధ్‌లకు వారి పూర్తి ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.. దీంతో వీరిద్ద‌రికి ఈ సిరీస్ మ‌రింత‌ కీలకంగా మార‌నుంది. టీ20 ఆడేందుకు టీమిండియా ఐర్లాండ్ టూర్ వెళ్ల‌డం వరుసగా ఇది రెండోసారి. ఇదివ‌ర‌కు 2022లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

టీమిండియా ఐర్లాండ్ టూర్ ఫుల్ షెడ్యూల్

IND vs IRE : ఆగస్టు 18 (శుక్రవారం) 1వ T20 (ది విలేజ్, డబ్లిన్) 7:30 PM
IND vs IRE : ఆగస్టు 20 (ఆదివారం) 2వ T20 (ది విలేజ్, డబ్లిన్) 7:30 PM
IND vs IRE : ఆగస్టు 23 (బుధవారం) 3వ T20 (ది విలేజ్, డబ్లిన్) 7:30 PM

- Advertisement -

భారత జట్టు:
జస్ప్రీత్ బుమ్రా (సి), రుతురాజ్ గైక్వాడ్ (విసి), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (డబ్ల్యుకె), జితేష్ శర్మ (డబ్ల్యుకె), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ కృష్ణ , అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.

ఐర్లాండ్ జట్టు:
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, గారెత్ డెలానీ, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, ఫియోన్ హ్యాండ్, లోర్కాన్ టక్కర్ (WK), మార్క్ అడైర్, జాషువా లిటిల్, బారీ మెక్‌కార్తీ, థియో వాన్జామినో, థియో వాన్‌కోమ్ వైట్, క్రెయిగ్ యంగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement