Monday, April 29, 2024

వృత్తి నైపుణ్యానికి ప్రతీక-ద్రావిడ్‌..

వెస్టీండీత్‌ జరిగిన మూడో వన్డేలో అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించి సిరీస్‌ నెగ్గడంపై భారత జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ టీమ్‌ సభ్యులను ప్రశంసల్లో ముంచెత్తాడు. వృత్తిపరమైన నైపుణ్యంతో సాధించిన విజయంగా అభివర్ణించాడు. యువ క్రికెటర్ల ఆటీతురు ప్రొఫెషనలిజమ్‌తో కూడుకుని ఉందని మెచ్చుకున్నాడు.

యువతరంతో కూడిన జట్టుతో ఇక్కడకు వచ్చాం. ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఆడినప్పటికీ కొందరు ఆటగాళ్లు ఇక్కడ గతంలో ఆడలేదు. కానీ వెస్టీండీస్‌ను సమర్థంగా ఎదుర్కొని మంచి ఆటతీరును ప్రదర్శించారని అన్నారు. చివరి వన్డేలో విజయం అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో మాట్లాడుతూ ద్రావిడ్‌ జట్టు సభ్యులపై ప్రశంసల జల్లు కురిపించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement