Sunday, April 28, 2024

వార్‌తో దెబ్బతిన్న సప్లయి చైన్‌

శిలాజ ఇంధనాలపై పెట్టుబడి పునరుద్ధరణ ఉంటుందని, అలాగే అనేక మంది సరఫరాను వేగవంతం చేయాల్సి వస్తుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ తెలిపారు. భారతదేశంలో, గ్రీన్‌ ఎనర్జీ వైపు తమ పరివర్తన మార్గం ఉందన్నారు. నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ గురించి మాట్లాడుతూ.. రూ.20,000 కోట్లతో ప్రారంభం అని, ఇది ఎండింగ్‌ కాదని, ప్రభుతం ముందుకు సాగడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. 9 రెట్లు మించి పరపతిని అనుమతించేటప్పుడు నష్టాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. జీడీపీ నిష్పత్తి రుణంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ప్రతీ అధికారి వృద్ధిని చూసేటప్పుడు స్థిరత్వం, స్థిరతాన్ని నిర్ధారించాలన్నారు. తాము చాలా ఆలోచించామని, పరిస్థితులు అనుకూలిస్తే తప్పకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.

ఆంక్షలు, నిలల ప్రభావం గురించి మాట్లాడుతూ.. ఎక్స్‌ప్యాన్షన్‌పై భారత్‌కు అంతగా నమ్మకం లేదని, తమ నిలలు వైవిధ్యభరితంగా ఉన్నాయని, ఎలాంటి ఆంక్షలు ఊహించలేదని, ఇలాంటి సమయంలో ఈ సమస్య గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ రేట్లు పెంచడంపై మాట్లాడుతూ.. యూఎస్‌ ఫెడ్‌ రేటు పెంపు స్పిల్‌ ఓవర్‌లు మిశ్రమంగా ఉన్నాయన్నారు. తాము గత సంవత్సరం ఆస్తి కొనుగోళ్లు నిలిపివేశామని, యూఎస్‌తో పాటు ఇతర దేశాలకంటే ముందు ఉన్నామని చెప్పుకొచ్చారు. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు వేరేరు దిశల్లో లాగుతున్నాయని, స్పిల్‌ ఓవర్‌లతో సంబంధం లేకుండా తాము భారత్‌ రూపాయి స్థిరతాన్ని కొనసాగించగలుగుతామని ధీమా వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement