Saturday, April 27, 2024

TS | జూనియర్ కళాశాలలకు 30 నుంచి సమ్మర్ హాలిడేస్

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 30 నుంచి మే 31 వరకు సెలవులు కొనసాగనున్నాయి. జూన్ 1న కాలేజీలు మళ్లీ తెరవబడతాయి. ఈ సెల‌వులు రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌కు వ‌ర్తించ‌నున్నాయి.

ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి కాలేజీల‌ను నిర్వ‌హించే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌కు అనుగుణంగా అడ్మిష‌న్లు తీసుకోవాల‌ని, ఆ తేదీల‌ను ప్ర‌క‌టించిన‌ప్పుడే ప్ర‌వేశాల ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement