Sunday, April 28, 2024

TS | కారు గోదాంలో అగ్ని ప్రమాదం.. గండిపేటలో ఘ‌ట‌న‌

రంగారెడ్డి జిల్లా గండిపేట సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఖానాపూర్‌లోని ఓ కారు గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో గోదాములో ఉన్న 25 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి.

దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement