Friday, April 26, 2024

VS10 | ఫుల్ ఫామ్‌లో విశ్వక్ సేన్.. రేపే VS10 టైటిల్ రివీల్

విశ్వక్ సేన్ ఇటీవ‌ల ‘గామి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక‌ మే 17న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలు విడుదలై వైరల్‌గా మారడంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత విశ్వక్ సేన్ చేస్తున్న సినిమా టైటిల్ రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. లవ్ అండ్ కామెడీ జానర్‌లో ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవితేజ నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement