Saturday, May 4, 2024

ఆంధ్రా ఊటీలో సమ్మర్‌ సందడి.. ఏజెన్సీకి పర్యాటకుల తాకిడి

అరకులోయ, ప్రభన్యూస్‌ : అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు లోయ ప్రాంతంలో సమ్మర్‌ సందడి నెలకొంది. మైదాన ప్రాంతాలలో ఎండలు అదరగొడుతున్నడంతో ఆతి చల్లని ప్రాంతమైన అందాల అరకులోయకు సందర్శకులు క్యూ కడుతున్నారు. ఈ ప్రాంతంలో కూడా గత నికి భిన్నంగా ఎండలు మండుతున్న అప్పటికీ ప్రాంతాలతో పోల్చి చూస్తే ఇక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతున్నాయి. దీంతో అరకులోయ అందాలను వీక్షించడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో పో-టె-త్తుతున్నారు. వేసవి సెలవులు కొనసాగుతుండడం, మైదాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం వలన పర్యాటకులు ఆంధ్రా ఊటీ- వైపు దృష్టి సారిస్తున్నారు. ఒకటి రెండు రోజులు ఇక్కడ ఆహ్లాదంగా గడుపుతామని పలు ప్రాంతాల పర్యాటకులు ఇక్కడకు తరలి వస్తున్నారు.

పర్యాటకుల తాకిడి పెరగడంతో ఇక్కడి సందర్శక ప్రాంతాలైన గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యాన కేంద్రం, సుంకరమెట్ట కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్‌ పర్యాటకులతో సందడి సందడి గా కనిపిస్తున్నాయి. అరకులోయ ఘాట్‌ రోడ్లో ఎక్కడికక్కడ పర్యాటక వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. కుటు-ంబ సమేతంగా పర్యాటకులు ఈ ప్రాంతాలకు తరలి వస్తుండడంతో ఇక్కడ సమ్మర్‌ సందడి నెలకొందని స్థానికులు చెప్పుకుంటు-న్నారు. ఇదిలా ఉండగా ఈ సమ్మర్‌ లో అరకు లోయకు రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఇక్కడి వాతావరణం చాలా బాగా ఉందని వివిధ ప్రాంతాల నుండి అరకు లోయ సందర్శనకు వస్తున్న పర్యాటకులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement