Saturday, April 27, 2024

Story : న్యూ ఇయర్.. న్యూ ఛాలెంజ్.. నారా లోకేష్ పాద‌యాత్ర‌.. 400రోజులు.. 4వేల కిలోమీట‌ర్లు

ప్ర‌స్తుతం పాద‌యాత్ర‌ల ట్రెండ్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ష‌ర్మిల‌..బండిసంజ‌య్..రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌ల‌ని చేశారు. ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌స్సు యాత్ర‌ని ప్రారంభించ‌నున్నారు. కాగా మున్ముందు పాద‌య‌త్రాల జోరు కొన‌సాగ‌నుంది.. ఈ మేర‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌ని ప్రారంభించ‌నున్నారు. మ‌రోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కు సిద్ధమయ్యారు. జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.. ఈ యాత్రకు ‘యువగళం’ నామకరణం చేశారు. పాదయాత్రకు సంబంధించి లోగో, పేరును ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు ఆవిష్కరించారు. 400 రోజులు 4వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్ర 100 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగనుందని అచ్చెన్నాయుడు తెలిపారు. కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ పాదయాత్ర హంగు, ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఉండేలా పాదయాత్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

యువతతో పాటూ మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు అండగా ముందకు సాగుతారన్నారు. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ 400 రోజుల సుధీర్ఘ యాత్రలో ప్రముఖ అందరూ ఇంటరాక్ట్ అయ్యేలా.. కనెక్ట్‌ అయ్యే అవకాశం కల్పించింది టీడీపీ. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ దృష్టిని యువత సమస్యలపై మళ్లించేందుకు యువత ఆధారిత ఎజెండాని రూపొందించే ప్రతిపాదనకు అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ 96862 96862కు మిస్ట్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా https://yuvagalam.com/ ద్వారా పాల్గొనవచ్చని తెలిపారు. నారా లోకేష్ పాదయాత్రలో వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామంటోంది టీడీపీ. గతంలో వైఎస్సార్‌సీపీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన సమయంలో టీడీపీ ప్రభుత్వం సహకారం అందించన విషయాన్ని గుర్తు చేశారు అచ్చెన్నాయుడు. ఓ బాధ్యతగా ఎవరికి ఇవ్వని భద్రత కల్పించామన్నారు. పాదయాత్రలు ఎవరు చేసినా ప్రభుత్వం ఆటంకం కల్పించకుండా సహకారం అందించాలన్నారు. తాము కూడా పాదయాత్రకు భద్రత కల్పించాలని.. ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ప్రభుత్వానికి లేఖలు రాస్తామన్నారు.. ఒకవేళ పాదయాత్రను ఇబ్బందిపెడితే తాము కూడా దేనికైనా సిద్ధమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్నట్లుగానే 400 రోజులు 4వేల కిలోమీటర్ల పాదయాత్రను నారా లోకేష్ పూర్తి చేస్తారన్నారు.

ఈ మూడన్నరేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు లేవని.. మహిళలకు భద్రత లేదన్నారు నేతలు. యువతకు భరోసా ఇవ్వడానికి, భవిష్యత్‌పై నమ్మకం కలిగించడానికి ఈ యువగళం దోహనం చేస్తుందన్నారు. అన్ని రంగాల సమస్యల్ని అధ్యయనం చేయడంతో పాటూ ఈ రాష్ట్ర భవిష్యత్ నిర్మాణానికి యువతను ఆహ్వానిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటూ యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నారా లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంను పాదయాత్ర ప్రారంభానికి వేదికగా ఎంచుకున్నారు. కుప్పం ఏపీకి సరిహద్దులో ఉంది.. అటు పాదయాత్ర ముగించే ఇచ్చాపురం కూడా ఒడిశా సరిహద్దులో ఉంది.మ‌రి లోకేశ్ ఈ పాద‌యాత్ర‌తో ఏ మేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి..మ‌రి ప్ర‌జ‌లు ఏ విధంగా ఆద‌రిస్తారో.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement