Friday, May 3, 2024

ఉస్తాద్ గా శ్రీసింహా.. బ‌ర్త్ డే గిఫ్ట్ గా పోస్ట‌ర్

ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి త‌న‌యుడు శ్రీ సింహా హీరోగా మ‌త్తువ‌ద‌ల‌రా చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం భాగ్ సాలే అనే చిత్రంలో నటిస్తున్నారు శ్రీ సింహా కోడూరి. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో చిత్రానికి ఓకే చెప్పారు. ఈ చిత్రానికి ఉస్తాద్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫిబ్ర‌వ‌రి 23న శ్రీ సింహా పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఫనిదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, క్రిషీ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రీ సింహా నిర్భయమైన పైలట్ పాత్రలో నటిస్తున్నాడు. ‘తన కలలకు రెక్కలు తొడిగి చిన్న పట్టణం నుంచి ఆకాశం వరకు ఎదిగిన నిర్భయమైన పైలట్ ను కలవండి’ అంటూ పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమాకు పవన్ కుమార్ పప్పుల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, అకీవ సంగీతం అందించనున్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement