Saturday, May 4, 2024

SRH | గాయంతో స్టార్ స్పిన్నర్ దూరం..

ఐపీఎల్ లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్ తో తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. హసరంగ స్థానంలో శ్రీలంక యువ స్పిన్నర్ విజయకాంత్ విస్కాంత్‌ను జట్టులోకి తీసుకున్నట్లు సన్‌రైజర్స్ జ‌ట్టు ప్రకటించింది. హసరంగ త్వరగా కోలుకోవాలని సన్‌రైజర్స్ టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటున్నట్లు తెలిపింది.

ఇక శ్రీలంక స్పిన్నర్ హసరంగాను గతేడాది జరిగిన వేలంలో సన్‌రైజర్స్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్‌లో హసరంగ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడుతున్న హసరంగాకు విశ్రాంతినివ్వడమే మంచిదని సన్‌రైజర్స్‌ యాజమాన్యం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement