Friday, May 3, 2024

Mrinal Thakur : సెల‌క్ష‌న్ లో తేడా….

టాలీవుడ్ లో ఇప్పటి వరకు బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మూడే మూడు చిత్రాలు చేసింది. కానీ కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది. ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ దక్కించుకుంది. సీతగా సీతారామంలో, యష్ణగా హాయ్ నాన్నలో, ఇందుగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో తన అందం, అభినయంతో అలరించింది.ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి మృణాల్ చేసిన ఫ్యామిలీ స్టార్ మూవీ మిక్స్ డ్ టాక్ అందుకుంది.

- Advertisement -

ఈ మూవీతో మృణాల్ ఠాకూర్ హ్యాట్రిక్ హిట్ కొడుతుందని అంతా భావించారు. కానీ బ్యూటీ సక్సెస్ జోష్ కు ఈ సినిమా బ్రేక్ వేసింది. అయితే డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్, పాత్రకు తన వంతు న్యాయం మాత్రం చేసింది. ఫస్టాఫ్ లో నవ్వుతూ, సెకండాఫ్ లో భావోద్వేగాలను బాగా పండించింది. కానీ దర్శకుడు పరశురామ్ పెట్ల.. ఆమె రోల్ ను సినిమాకు తగ్గట్టు డెవలప్ చేయడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. అయితే టాలీవుడ్ లో ఇప్పటి వరకు మృణాల్ ఠాకూర్.. చేసిన మూడు సినిమాలు కూడా ఒకే జోనర్ కు చెందినవి కావడం గమనార్హం.

మూడు సినిమాల్లో కూడా ఒక మిడిల్ క్లాస్ కుర్రాడితో ప్రేమలో పడిపోయే ధనిక యువతిగా నటించింది. క్యారెక్టర్ పరంగా మూడు సినిమాల్లోని రోల్స్ సేమ్ కానప్పటికీ.. బేసిక్ కాన్సెప్ట్ ఒకటే అవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మంచి టాలెంట్ ఉన్న మృణాల్ ఠాకూర్.. మూడు చిత్రాలకు గాను సేమ్ జోనర్ కు చెందిన క్యారెక్టర్లను సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రెజంటేషన్ వేర్వేరుగా ఉన్నా.. మంచి ప్రతిభ గల నటి అలా చేయకూడదని సూచిస్తున్నారు. కొత్త సినిమాలను జాగ్రత్తగా చూసి ఎంపిక చేసుకోవాలని అంటున్నారు. సెలక్షన్ లో అవసరమైన మార్పులు చేసుకుని కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సజ్జెస్ట్ చేస్తున్నారు. అయితే సినిమాల విషయంలో తొందరపడట్లేదు ఈ బ్యూటీ. పలువురు హీరోయిన్లలా చేతి నిండా ప్రాజెక్టులు పెట్టుకుని బిజీ బిజీగా గడపట్లేదు. తెలుగు సినిమాలు చేస్తూనే కోలీవుడ్ లో మెల్లగా అవకాశాలు దక్కించుకుంటోంది. తమిళ స్టార్ హీరోలు అజిత్, శివకార్తికేయన్, శింబుతో ఆడిపాడనుంది. మరి మృణాల్ ఠాకూర్ నెక్స్ట్ ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో, ఎలాంటి హిట్ కొడుతుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement