Saturday, May 18, 2024

AP | టీడీపీ డొనేష‌న్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన చంద్రబాబు..

ఎన్నికల సమయం కావడంతో ఏ పార్టీ ముందుకు వెళ్లాలంటే నిధులు కావాలి. ఈ మేరకు విరాళాల కోసం టీడీపీ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. tdpforandhra.com పేరుతో విరాళాలు సేకరించనున్నారు. ఇవాల మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో.. విరాళం వెబ్‌సైట్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ మేరకు వెబ్ సైట్ ద్వారా పార్టీకి రూ. 99,999 మేర తొలి విరాళాన్ని చంద్రబాబు అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అభిమానులు, మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని కోరారు. ఎన్ఆర్ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వడమే కాదు.. ఏపీకి వచ్చి పార్టీ కోసం.. రాష్ట్రం కోసం పని చేయాలి.. టీడీపీ విధానాల వల్ల తాము ఎలా బాగుపడ్డామనే విషయాన్ని ప్రజలకు వివరించాలి అని అన్నారు. విరాళం ఇచ్చిన వారికి రశీదులు కూడా ఇస్తారు. ఈ వెబ్‌సైట్ రూ.99, రూ.999, రూ.9,999, రూ.19,999, రూ.99,999 ఇతర మొత్తాలకు ఎంపికలను అందిస్తుంది. 18 ఏళ్లు పైబడిన వారి నుండి విరాళాలు స్వీకరించబడతాయి. ఆ మేరకు వెబ్ సైట్ లోనే ఆధార్ వెరిఫికేషన్ జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement