Sunday, May 5, 2024

ఈనెల 10న సంపూర్ణ సూర్యగ్రహణం.. ప్రత్యేకత ఏంటి?

ఈనెలలో ఆకాశంలో మరోసారి అద్భుతం జరగబోతోంది. ఈనెల 10న సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఆ రోజున సూర్యుడు, భూమి మధ్యకు చందమామ రాబోతోంది. అందువల్ల సూర్య కిరణాలు చందమామపై పడతాయి. చందమామ నీడ భూమిపై పడుతుంది. ఫలితంగా భూమిపై ఉన్న వారికి సూర్యుడు కనిపించడు. ఇలా చందమామ సూర్యుడికి పూర్తిగా అడ్డుగా వచ్చినప్పుడు… చందమామ చుట్టూ… ఓ రింగ్‌లా ఏర్పడుతుంది. దాన్నే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటున్నారు. అది చాలా కాంతి వంతంగా మెరుస్తూ ఉంటుంది. అది తప్పక చూడాలని పలువురు పరిశోధకులు సూచిస్తున్నారు.

ఈసారి సూర్య గ్రహణం గంటకు పైగా ఉంటుంది. ఈ సమయంలో… చందమామ పూర్తిగా అడ్డువచ్చినప్పుడు నల్లటి చందమామ చుట్టూ… మండుతున్న అగ్నితో రింగ్ ఏర్పడుతుంది. ఇలాంటి అరుదైన దృశ్యం ఎంతో మానసిక ఉల్లాసం కలిగిస్తుందని చెప్తున్నారు. చాలా దేశాల్లో ఇది కనిపించనుంది.

ఎక్కడెక్కడ కనిపిస్తుంది?
జూన్ 10 నాటి అరుదైన సూర్యగ్రహణం భారతీయులకు కనిపించదు. ఇది గ్రీన్ ల్యాండ్, ఈశాన్య కెనడా, ఉత్తర ధృవం, రష్యాలో కొంత వరకూ పూర్తిగా కనిపిస్తుంది. అలాగే… యూరప్ దేశాలు, ఉత్తర అమెరికా, ఆసియా, ఆర్కిటిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో కొద్దిగా కనిపిస్తుంది.

సాధారణంగా సూర్య గ్రహణాల్లో 3 రకాలు ఉంటాయి. సంపూర్ణ సూర్యగ్రహణం, పాక్షిక సూర్య గ్రహణం, వలయాకార (రింగ్) సూర్య గ్రహణం. భూమి, చందమామ… గుండ్రంగా కాకుండా… కోడి గుడ్డు ఆకారంలో తిరుగుతూ ఉంటాయి. అందువల్ల చందమామ మనకు కొన్నిసార్లు ఇవి చిన్నగా… కొన్నిసార్లు పెద్దగా కనిపిస్తుంది. వలయాకార సూర్యగ్రహణం వచ్చినప్పుడు చందమామ భూమికి చాలా దూరంలో ఉంటుంది. అది చిన్నగా కనిపిస్తుంది. అది చందమామను పూర్తిగా మూసివేయలేదు. జూన్ 10న అదే జరగబోతోంది. అందువల్ల దీన్ని సంపూర్ణ సూర్యగ్రహణంతో పాటు వలయాకార సూర్య గ్రహణంగా పిలుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement