Thursday, April 18, 2024

అజిత్ కు బాంబ్ బెదిరింపు కాల్ !!

సెలబ్రిటీలకు బెదిరింపు కాల్స్ సహజంగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. తాజాగా తమిళ్ స్టార్ హీరో అజిత్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీనితో ఒక్కసారిగా కోలీవుడ్ లో కలకలం రేగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఇంటిలో బాంబు పెట్టినట్టుగా చెప్పారు.అయితే వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు అజిత్.

దీంతో పోలీసులు అజిత్‌ నివాసానికి వెళ్లి జాగిలాలతో తనిఖీలు చేశారు.కానీ అక్కడ ఏమి దొరకక పోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వినోద్ తో వాలిమై సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హుమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement