Tuesday, May 14, 2024

ఒకే పాత్ర… ఒకే షాట్‌

హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘105 మినిట్స్‌’. బొమ్మక్‌ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు జరుగుతున్నాయి. సింగిల్‌ షాట్‌, సింగిల్‌ క్యారెక్టరతో తీసిన చిత్రమిది. కొన్ని కీలక సన్నివేశాల్లో కనిపించ బోయే గ్రాఫిక్స్‌ చాలా ప్రాధాన్యత ఉంది. అవి అద్భుతంగా వస్తున్నాయని చిత్ర యూనిట్‌ తెలిపింది.


ఇలాంటి ప్రయోగాత్మక చిత్రానికి సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉంది. బ్యాగ్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించేందుకు ఛాలెంజ్‌గా ఉందని ఈ చిత్ర సంగీత దర్శకులు సామ్‌ సి.యస్‌ అభిప్రాయ పడ్డారు. హన్సిక నటన ప్రత్యేక ఆకర్షణ. ఆమెకు ఛాలెంజింగ్‌ పాత్రని యూనిట్‌ కొనియాడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement