Wednesday, May 1, 2024

TS : సింగ‌ర్ మంగ్లీకి రోడ్డు ప్ర‌మాదం…

సింగ‌ర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమెతో పాటు కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. అదేరోజు అర్ధరాత్రి తర్వాత మేఘ్‌రాజ్‌, మనోహర్‌తో కలిసి ఆమె కారులో హైదరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు. శంషాబాద్‌ మండలం తొండుపల్లి వంతెన వద్దకు రాగానే.. కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వెనక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement