Monday, April 29, 2024

నాని 30లో శృతి హాస‌న్.. గోవాలో షూటింగ్

నాని ప్రస్తుతం కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నాని30 మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ మూవీలో ‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగగా నటిస్తోంది. కాగా, మూవీలో మరో కీలక పాత్ర కోసం శృతి హాసన్ మూవీ షూట్ లో జాయిన్ చేయింది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా, నాని, శృతి హాసన్ తొలిసారి కలిసి నటిస్తున్నారు.

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ మూవీని నిర్మిస్తున్నారు. సీఓఓ కోటి పరుచూరి. మలయాళ స్వరకర్త హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement