Tuesday, April 30, 2024

ఐపీఎల్‌ మ్యాచ్‌ నెం.1000.. వాంఖడేలో వేడుకకు బీసీసీఐ ఏర్పాట్లు

ఐపీఎల్‌లో రేపు (ఆదివారం) 1000వ మ్యాచ్‌ జరగనుంది. ఈ మహాఘట్టానికి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికవుతోంది. ముంబై ఇండియన్స్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు చారిత్రక పోరులో తలపడనున్నాయి. వెయ్యవ మ్యాచ్‌ను పురస్కరించుకుని బీసీసీఐ చిన్నపాటి వేడుక నిర్వహించనుంది. 10-15 నిముషాలపాటు జరిగే కార్యక్రమంలో ఐపీఎల్‌ ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహిస్తారు. అనంతరం మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ రవిశాస్త్రి మైదానంలోని క్రికెట్‌ అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఐపీఎల్‌ గురించి కొందరు ఆటగాళ్ల సందేశాల వీడియోలను ప్లే చేస్తారు. తర్వాత ముంబైఇండియన్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల కెప్టెన్లకు బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు మెమెంటోను బహుకరిస్తారు. చివరగా జాతీయ గీతాలాపనతో వేడుక ముగుస్తుంది.

సరిగ్గా 15 ఏళ్ల కిందట 2008లో ఐపీఎల్‌ పేరుతో టీ20 లీగ్‌కు లలితమోడీ రూపకల్పన చేశాడు. ఇది క్రికెట్‌ స్వరూపాన్నే మార్చేసింది. ఆటగాళ్లతోపాటు ఫ్రాంచైజీలకు, బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది. మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. తద్వారా వారి అసాధారణ ప్రతిభను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేయగలిగింది. జాతీయ జట్టుకు ఎందరో యువఆటగాళ్లను అందించడానికి ఐపీఎల్‌ సహాయపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement