Monday, May 6, 2024

రామోజీఫిల్మ్ సిటీలో.. పుష్ప2 షూటింగ్

హైదరాబాద్ రామోజీఫిల్మ్ సిటీలో పుష్ప2 మూవీ షూటింగ్ ప్రారంభమయింది. ఇక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్ లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగులో త్వరలోనే బన్నీ పాల్గొననున్నాడని సమాచారం. పెద్దగా గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ ను ప్లాన్ చేసినట్టుగా సమాచారం. ఫస్ట్ పార్టులో కనిపించిన సునీల్ .. అనసూయ పాత్రలు జనంలోకి బాగా వెళ్లాయి. ఆ పాత్రలు రెండూ కూడా మరింత ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. అలాగే ఫహాద్ ఫాజిల్ పాత్ర మరింత పవర్ఫుల్ గా కనిపించనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి కూడా కొంతమంది స్టార్లను రంగంలోకి దింపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రష్మికతో పాటు మరో హీరోయిన్ కి కూడా ఈ సినిమాలో ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఐటమ్ సాంగ్ లో కాజల్ కనిపించనుందట. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement