Thursday, May 2, 2024

మెక్సికోలో కాల్పుల క‌ల‌క‌లం..

మెక్సికోలో గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు బార్ లో కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో 12 మంది మృత్యువాత ప‌డ్డారు. మ‌రికొందిరికి గాయాల‌య్యాయి. మెక్సికోలోని ఇరపూటో నగరంలో నిన్న జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. గువానాజువాటో రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఓ బార్‌లోకి చొరబడిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆరుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు గల కారణం తెలియరాలేదు. నిందితుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement