Saturday, May 4, 2024

శింబు న‌టించిన మూవీ హిట్ – కాస్ట్ లీ కారుని గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత‌

వెందు తానింధాతు కాడు చిత్రంతో రీసెంట్ గా త‌మిళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు హీరో శింబు. ఈసినిమా తెలుగులో ది లైఫ్‌ ఆఫ్ ముత్తు పేరుతో రిలీజ్ అయ్యింది. సెప్టెంబర్ 15న రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. తమిళనాట‌ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. గౌతమ్ మీనన్‌ కూడా చాలా కాలం తర్వాత ఈ మూవీతో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సాధించాడు. ఒక చిన్న ఊరు నుండి వచ్చిన ముత్తు పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఒపెనింగ్స్ అంతగా రాకపోయినా రోజు రోజుకు ఈ సినిమాపై ఆదరణ పెరుగుతుంది. రీసెంట్ గా ఈసినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం.. చిత్ర నిర్మాత హీరో శింబుతో పాటు గౌతమ్‌ మీనన్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్‌లను ఇచ్చాడు.వెందు తానింధాతు కాదు ఘన విజయం సాధించడంతో నిర్మాత ఇషారి.కే గణేష్ హీరోకు, దర్శకుడికి గిఫ్ట్‌ గా ఇచ్చాడు. హీరో శింబుకు కోటీ రూపాయలు విలువ చేసే టోయోటో న్యూ వెల్‌ఫైర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక దర్శకుడు గౌతమ్‌ మీనన్‌కు కాస్ట్‌లీ బైక్‌ను ఇచ్చాడు. నిర్మాతకు మంచి ప్రాఫిట్స్ రావడంతోనే.. సంతోషంలో ఆయన ఇలా చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement