Sunday, April 28, 2024

బిగ్‌బాస్-5 లిస్ట్ నుంచి షణ్ముఖ్ జశ్వంత్ ఔట్

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్-5. ఈ షో సెప్టెంబరులో ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ప్రోమో ద్వారా సీజ‌న్-5కు కూడా నాగార్జున‌నే హోస్ట్ అని ఖరారైపోయింది. ఇక ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల విష‌యంలోనే కొంత క‌న్ఫ్యూజ‌న్ ఉంది. కొత్త జాబితాలో యాంకర్‌ రవి, ఆర్‌జే కాజల్‌, శ్వేతా వర్మ, లహరి షారి, కమెడియన్‌ లోబో, సిరి హన్మంతు, నటి ప్రియ, కార్తీకదీపం ఉమాదేవి, 7 ఆర్ట్స్‌ సరయు, నటుడు మానస్‌ షా, మోడల్‌ జశ్వంత్‌, నటుడు సన్నీ, విశ్వ, టీవీ9 యాంకర్‌ ప్రత్యూష‌, ఆట సందీప్‌/రఘు మాస్టర్ల పేర్లు ఉన్నాయి.

గ‌తంలో ప్ర‌చారం జ‌రిగిన లిస్ట్‌లో యాంకర్‌ వర్షిణీ, ట్రాన్స్‌జెండర్‌ ప్రియాంక, యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్ జశ్వంత్‌, యానీ మాస్టర్‌, యూట్యూబర్‌ నిఖిల్‌ల పేర్లు ఉండగా కొత్త లిస్ట్‌లో వారి పేర్లు లుక‌పోవ‌డం గ‌మన‌ర్హం. ‘బోర్‌డ‌మ్‌కు చెప్పేయ్ గుడ్‌బై.. వ‌చ్చేసింది బిగ్‌బాస్‌ తెలుగు సీజ‌న్ 5’ అంటూ నిర్వాహ‌కులు షోపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఆచార్య సినిమా కొత్త పోస్టర్ వచ్చింది…కానీ రిలీజ్ డేట్ రాలేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement