Thursday, March 28, 2024

కేజీఎఫ్ 2 సౌత్ శాటిలైట్ హక్కులు వీరివే!! అఫీషియల్

కే జి ఎఫ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు రాక్ స్టార్ యశ్. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ పార్ట్ 2 రిలీజ్ కు సిద్ధంగా ఉంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో… సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారు. అలాగే రావు రమేష్, ప్రకాష్ రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ని రిలీజ్ చేసింది.

ఈ సినిమాకు సంబంధించిన సౌత్ ఇండియన్ అన్ని భాషల శాటిలైట్ హక్కులను జీ సంస్థ వారు కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు,తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల తాలూకా హక్కులను వారు కొనుగోలు చేశారు. కాగా ఈ అనౌన్స్మెంట్ ని చేయడం తనకెంతో సంతోషంగా ఉందని హిందీ రైట్స్ ఒక్కటే హోల్డ్ లో ఉన్నాయని ట్వీట్ చేశారు యశ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement