Saturday, May 4, 2024

Grammy Awards: గ్రామీ విజేతగా శంకర్​ మహదేవన్​…లాస్ ఏంజిల్స్‌లో అవార్డు ప్ర‌ధానం…

మ్యూజిక్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం గ్రామీ. 66వ గ్రామీ అవార్డ్స్ లాస్ ఏంజిల్స్ లో మన టైం ప్రకారం ఇవాళ ఉదయం ఆట్ట‌హాసంగా జ‌రిగాయి. ప్రపంచవ్యాప్తంగా పలు కేటగిరీల్లో అనేక సాంగ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియో ఆల్బమ్స్ పోటీపడ్డాయి. ఈసారి గ్రామీ అవార్డ్స్ లో ఇండియన్స్ కి కూడా అవార్డులు దక్కాయి.

అంతర్జాతీయ సంగీత వేదికపై ఇండియన్ మ్యూజిక్ ఆర్టిస్టులు శంకర్ మహదేవన్​, జాకీర్ హుస్సేన్ జయకేతనం ఎగరవేశారు. వీరు కంపోజ్​ చేసిన ‘దిస్ మూమెంట్​’ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్​ ఆల్బమ్​గా అవార్డ్ ను​ సొంతం చేసుకుంది. ఈ పాటను 8 మంది కలిసి కంపోజ్ చేయగా.. అందులో జాన్ మెక్​ లాగ్లిన్(గిటార్​), జాకీర్ హుస్సేన్​(తబ్లా), శంకర్​ మహదేవన్​(సింగర్​), వి సెల్వగనేశ్​(పెర్కషనిస్ట్​), గనేశ్​ రాజాగోపాలన్​(వయోలిన్ విద్వాంసుడు​) ఉన్నారు. ఇక, భారతీయ సంగీతం గొప్పదనాన్ని విశ్వ వేదికపై చాటిన వీరికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శక్తి ఫ్యూజన్‌ రూపొందించిన దిస్ మూమెంట్ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డు, బెస్ట్‌ గ్లోబల్‌ మ్యూజిక్ ఆల్బమ్‌ కేటగిరిలో అవార్డ్ రావ‌డం జ‌రిగింది. ఈ అవార్డును త‌న‌ భార్యకు అంకితమిస్తున్న‌ట్లు శంకర్‌ మహదేవన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement