Sunday, April 28, 2024

ఏప్రిల్ 14న శాకుంత‌లం.. ప్ర‌క‌టించిన మేక‌ర్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత న‌టిస్తోన్న శాకుంత‌లం చిత్రం ఈ నెల 17న రిలీజ్ కావాల్సి ఉండ‌గా ఈ చిత్రం రిలీజ్ వాయిదా ప‌డింది. దాంతో ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఏప్రిల్‌ 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. కాగా, ఫిబ్రవరి 17న ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉండగా, ఆ డేట్‌ న రిలీజ్‌ చేయలేమని ఇటీవలే పేర్కొంది చిత్ర బృందం. స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన లేటెస్ట్‌ పాన్‌ ఇండియా మూవీ ‘శాకుంతలం’. శకుంతలగా సమంత నటించిన ఈ సినిమాలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నారు.ఈ సినిమా తెలుగు, హందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా ‘శాకుంతలం’ సినిమా రూపొందింది. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా గుణశేఖర్ తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించారు. నిర్మాణ భాగస్వామిగా దిల్ రాజు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement