Friday, May 17, 2024

Sexual Harassment – లైంగిక వేధింపులు నిజ‌మే – బ్రిజ్ భూష‌ణ్ పై పోలీసులు ఛార్జీషీట్

న్యూఢిల్లీ – మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఆయన వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కాగా, బ్రిజ్ భూషణ్ పై ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో సుమారు 108 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఆయన శిక్షార్హుడేనని ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్ లో తెలిపారు. నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.

ఇదిలా ఉండగా ఢిల్లీ కోర్టు శుక్రవారం బ్రిజ్ భూషణ్ కు సమన్లు జారీ చేసింది. కేసును కొనసాగించేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. జులై 18న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే మహిళా రెజ్లర్లు తనపై చేసిన లైంగిక వేధింపు ఆరోపణలను బ్రిజ్‌ భూషణ్‌ పలుమార్లు ఖండించారు. తాను నిర్దోషిన‌ని పేర్కొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement