Thursday, May 2, 2024

Minister : ప్రొఫెసర్ లింబాద్రిని ఆదర్శంగా తీసుకోవాలి… వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, జులై 11(ప్రభ న్యూస్) : చదువే పరమావధిగా కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రొఫెసర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్ లో దళిత రత్న అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మేయర్ దండు నీతూ కిరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రపంచ వ్యాప్తంగా అంబేడ్కర్ ఆశయాలు చాటి చెప్పేలా… భావితరాలకు స్ఫూర్తి ఇచ్చేలా హైద్రాబాద్ లో రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు సీఎం కేసీఆర్ తనకు అప్పచెప్పడం… తనను భాగస్వామి చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. నిరు పేదల సంక్షేమ కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేశారనీ తెలిపారు. దళితులు, బలహీన వర్గాల కోసం… దళితుల జాతి అభ్యున్నత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి సంవత్సరానికి మూడు లక్షల మంది దళిత బిడ్డలు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు.

దళితుల పిల్లల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. దళిత వర్గాలు వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలని, రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని దళిత బంధు ప్రవేశపెట్టారని తెలిపారు. దళిత బంధు ద్వారా ఈ సంవత్సరం లక్ష 40 వేల కుటుంబాలకు న్యాయం చేకూరుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం, దళితుల కోసం పనిచేసిన వారిని తెలంగాణ ప్రజలు కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా దళిత రత్న అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవాల కమిటీ చైర్మన్ పాపన్న, నాంపల్లి, మారయ్య గౌడ్, బంగారి సాయిలు, సంఘాల నాయకులు దళితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement