Wednesday, May 8, 2024

సెట్ల తేదీలు విడుదల.. మే 15 నుండి 25 మధ్య ఇఎపిసెట్‌

అమరావతి,ఆంధ్రప్రభ: 2023 ఏడాదిలో డిగ్రీ, పిజి, పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశానికి గాను నిర్వహించే వివిధ సెట్ల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది మే మాసం 15 నుండి 22 తేదీల మధ్య ఇఎపిసెట్‌(ఎంపిసి) నిర్వహించనున్నారు. అలాగే ఇఎపిసెట్‌(బైపిసి) ప్రవేశపరీక్షను మే మాసం 23 నుండి 25 తేదీల మధ్య నిర్వహించనున్నారు.

ఇసెట్‌ మే 5వ తేదీన, పిజిఇసెట్‌ మే 28 నుండి 30 తేదీల మధ్యలో, ఐసెట్‌ మే 25,26 తేదీల్లో, లాసెట్‌ మే 20వ తేదీన, ఎడ్‌సెట్‌ మే 20వ తేదీన, జూన్‌ 6 నుండి 10వ తేదీల మధ్య పిజిసెట్‌, జూన్‌ 12 నుండి 14 తేదీల మధ్య ఆర్‌సెట్‌ నిర్వహించనున్నారు. అయితే ఏదైనా కారణాల రీత్యా ఈ తేదీల్లో కొంత మార్పులు ఉండే అవకాశం కూడా ఉందని ఉన్నత విద్యా మండలి తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement