Thursday, May 2, 2024

జెట్‌ ఎయిర్‌వేస్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్‌.. త్వరలో వాణిజ్యపరంగా సేవలు..

జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఇది గుడ్‌ న్యూస్‌. రానున్న మరికొన్ని నెలల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ కమర్షియల్‌ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. సెక్యూరిటీపరమైన క్లియరెన్స్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది. జలాన్‌-కల్రాక్‌ కన్సార్టియం ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్లుగా కొనసాగుతున్నారు. ఇంతకుముందు జెట్‌ ఎయిర్‌వేస్‌ నరేష్‌ గోయల్‌ యాజమాన్య నేతృత్వంలో సేవలు అందించింది. 2019, ఏప్రిల్‌ 17న చివరి విమానాన్ని నడిపింది. గురువారం.. ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికేట్‌ పొందేందుకు.. ఎయిర్‌లైన్‌ తన టెస్టు ఫ్లైట్‌ను హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రారంభించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మే 6న ఎయిర్‌లైన్‌కు లేఖ పంపింది.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భద్రతాపరమైన క్లియరెన్స్‌ గురించి అందులో ప్రస్తావించింది. విమానం దాని భాగాలు సరిగానే పని చేస్తున్నాయని ఏవియేషన్‌ రెగ్యులేటర్‌ డీజీసీఏకి తెలిపింది. దీని కోసం విమానాన్ని టెస్టు డ్రైవ్‌ కూడా చేయడం జరిగింది. టెస్టు డ్రైవ్‌ విజయవంతంగా పూర్తయిన తరువాత.. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. ప్రూవింగ్‌ విమానాలు.. డీజీసీఏ అధికారులు, ఎయిర్‌లైన్‌ అధికారులు ప్రయాణికుల్లా ఉంటారు. క్యాబిన్‌ సిబ్బందితో కూడిన వాణిజ్య విమానాన్ని పోలి ఉంటాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement