Sunday, May 19, 2024

వీక్షకుల కోసం సైన్స్‌ బియాండ్‌ బోర్డర్స్‌..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : బోన్జోర్‌ ఇండియాలో భాగం సైన్స్‌ బియాండ్‌ బోర్డర్స్‌ ఎంబసీ ఆఫ్‌ ఫ్రాన్స్‌, దీని సాంస్కృతిక సేవ, ఇనిస్టిట్యూట్‌ ఫ్రాన్సిస్‌ ఎన్‌ ఇండీ, అలయన్స్‌ ఫ్రాన్సిస్‌ నెట్‌వర్క్‌, కాన్సులేట్స్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ ఇన్‌ ఇండియా కళాత్మక, సాంస్కృతిక, విద్య, సాహిత్య కార్యక్రమాలలో భాగం బోన్జోర్‌ ఇండియా. బోన్జోర్‌ ఇండియా సైన్స్‌ బియాండ్‌ బోర్డర్స్‌ ప్రదర్శనను బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ వద్ద శనివారం తెరిచారు. ఈ ప్రదర్శన ప్రజల సందర్శనార్థం జూన్‌ 26వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ తెరిచి ఉంటు-ంది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్రప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం (ఐఅండ్‌సీ), ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, బెంగళూరులోని కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ థియర్రీ బెర్తెలాట్‌, బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ కె జి కుమార్‌ పాల్గొన్నారు. సుప్రసిద్ధ స్పేస్‌ సైంటిస్ట్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రొప్యుల్షన్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ పద్మశ్రీ జ్ఞాన గాంధీ వాసుదేవన్‌ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. బెంగళూరులోని కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ థయర్రీ బెర్థెలాట్‌ దీనిని పునరుద్ఘాటిస్తూ.. నూతన సైన్స్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌లను నిర్మించాలంటే మన ఇరు దేశాలూ ఇప్పటికే సాధించిన విజయాలు, చరిత్ర, బ్యాక్‌గ్రౌండ్‌ కూడా తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement