Sunday, April 28, 2024

Scam – ఎల‌క్టోర‌ల్‌ బాండ్లు.. అతి పెద్ద స్కాం – సీతారాం ఏచూరి

దేశ చరిత్రలో ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ అతి పెద్ద కుంభకోణమని.. ఇది మాఫియా తరహా దోపిడీలకు దారితీసిందని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. ఎలక్టోరల్‌ బాండ్లను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వారిలో ఏచూరి కూడా ఉన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.. ‘నల్లధనాన్ని అరికట్టడానికి బదులుగా మనీ లాండరింగ్‌కు అనుమతిస్తున్నారు. చాలా కంపెనీలు తమ వార్షిక లాభాల కంటే అనేక రెట్లు ఎక్కువగా ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేశాయి. సుప్రీం కోర్టు ఈ బాండ్ల విధానాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. కార్పొరేట్‌ కంపెనీలు నేరుగా పార్టీలకు నిధులివ్వకూడదు. ప్రభుత్వానికి ఆ నిధులు అందజేస్తే.. ఎన్నికల కోసం వాటిని ఖర్చుచేస్తే బాగుంటుంది. అధికార బీజేపీ చర్యలు దేశంలో దారుణమైన రాజకీయ అవినీతికి దోహదం చేస్తున్నాయి’ అని ఏచూరి మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement