Sunday, April 28, 2024

నటనకు బ్రేక్ ఇవ్వనున్న సమంత.. గుడ్ న్యూస్ చెప్పడానికేనా?

తెలుగులో అగ్ర హీరోయిన్‌లలో ఒకరిగా అక్కినేని వారి కోడలు సమంత కొనసాగుతోంది. తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలను పోషించిన సమంత ఎందరో అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు, టాక్ షోలలో సైతం నటించిన సమంత.. తనకు నటన పట్ల తనకున్న ప్రేమను చాటుకుంది. ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీనికి సంబంధింది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ అవార్డుల్లో ఉత్తమ నటి అవార్డుకు కూడా సమంత ఎంపికైంది. అయితే ఈ సిరీస్‌లో ఆమె పోషించిన రాజి పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ… ఎవరినైనా తాను బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరింది.

మరోవైపు సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం తమిళ చిత్రం ‘కాత్తు వకుల రెండు కాదల్’ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె సంచలన ప్రకటన చేసింది. కొంత కాలం పాటు నటనకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నానని ఆమె ప్రకటించింది. కుటుంబంతో హాయిగా గడపాలని భావిస్తున్న ఆమె.. కొంత కాలంగా కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదు. వచ్చే ఏడాదే ఆమె మళ్లీ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ వార్తలు సమంత అభిమానులను షాక్ కు గురి చేశాయి. కాగా సమంత నటన నుంచి బ్రేక్ తీసుకోవడానికి కారణం గుడ్ న్యూస్ చెప్పడానికే అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో త్వరలోనే సమంత తల్లి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ వార్త కూడా చదవండి: ఆర్.ఆర్.ఆర్‌కు పోటీగా రానున్న బాలయ్య?

Advertisement

తాజా వార్తలు

Advertisement