Thursday, March 28, 2024

ఆర్ ఆర్ ఆర్ కి పోటీగా బాలయ్య ?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అలాగే పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ పై ఎప్పటి నుంచో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా దసరాకు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ డేట్ కే అఖండ కూడా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement