Friday, May 3, 2024

Update | రికార్డుల వేట‌లో సలార్ టీజ‌ర్.. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ రిలీజ్ ఉంటుంద‌న్న‌ మేక‌ర్స్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన లేటెస్ట్ యాక్ష‌న్ పాక్డ్ మూవీ “సాలార్”. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. తాజాగా ఈ సినిమా నుండి టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌స్తోంది.. ఇప్ప‌టివ‌ర‌కు 100 మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతుంది. సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఈ సినిమా అంచ‌నాలు ఏ లెవెల్ లో ఉన్నాయో తెలుస్తోంది. దీంతో అభిమానులకు.. ప్రేక్ష‌కుల‌కు కృతజ్ఞతలు తెలుపుతూ నిర్మాణ సంస్థ మూవీ ట్రైలర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను అందించింది.

భారతీయ సినిమా గొప్పతనాన్ని చాటిచెప్పే అత్యంత ఆసక్తితో కూడిన ట్రైలర్‌ను విడుదల రిలీజ్ చేయ‌డానికి మేము సిద్ధమవుతున్నాము. అంటూ.. స‌లార్ మూవీ ట్రైల‌ర్ వ‌చ్చే నెల ఆగస్టు నెలాఖరు లోపు ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాగా, ఈ యాక్షన్ డ్రామా “సాలార్” రెండు భాగాలుగా నిర్మితమవుతోంది. “సాలార్-ది సీజ్ ఫైర్” అనే ఫ‌స్ట్ పార్ట్ లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement