Thursday, May 2, 2024

Safe – జ‌వాన్ షూటింగ్ లో షారూక్ ఖాన్ కి గాయం … ముక్కుకి స‌ర్జ‌రీ

ముంబై – బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ షూటింగ్ లో గాయ‌ప‌డ్డారు.. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ జవాన్ చిత్రీకరణ కోసం లాస్ ఏంజెల్స్ కొనసాగుతున్న‌ది . ఈ మూవీ షాట్ చిత్రీకరణ సమయంలో ఆయనకు ప్రమాదం జరిగింది. ముక్కుకి తీవ్ర గాయమైంది. వెంటనే సిబ్బంది దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రమాదం ఏమీ లేదు, ముక్కుకి మైనర్ సర్జరీ చేశారు.. అనంతరం షారుక్ డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ గాయంప‌డ‌టం సంఘ‌ట‌న వారం రోజుల క్రితం జ‌ర‌గ‌గా ప్ర‌స్తుతం వెలుగులోకి వ‌చ్చింది.. షారూక్ షూటింగ్ కు విరామం ఇచ్చి ముంబైకు తిరిగి చేరుకున్నారు.. ప్ర‌స్తుతం ఆయ‌న విశ్రాంతి తీసుకుంటున్నారు.. ఈ ప్రమాదంపై షారుక్ ఖాన్ టీమ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. షారుక్ కి ప్రమాదం జరిగిందన్న మేటర్ లీక్ కావంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన క్షేమం అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో వ‌స్తున్న‌ జవాన్ మూవీ చిత్రం పై భారీ హైప్ నెలకొంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. జవాన్ చిత్రంలో ప్రియమణి ఓ కీలక రోల్ చేస్తున్నారు. రెండు వందల కోట్ల‌కు పైగా బడ్జెట్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా జవాన్ తెరకెక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement