Thursday, May 9, 2024

సాయి మందిరం మూసివేత‌పై పుకార్లు.. త‌ప్పుడు ప్ర‌చారాలు న‌మ్మొద్దు

షిరిడీ (ప్రభ న్యూస్) : షిరిడీ సాయి ఆల‌యం మూసివేయ‌నున్న‌ట్టు జ‌రిగిన త‌ప్పుడు ప్ర‌చారంతో భ‌క్తుల‌లో ఆందోళ‌న నెల‌కొంది. దీంతో షిరిడీకి ముంద‌స్తు ప్ర‌య‌ణాలు కోసం టికెట్స్ బుక్ చేసుకున్న‌వారు పెద్ద ఎత్తున క్యాన్సిల్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై సాయి సంస్థాన్ అధికారులు కూడా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇవ‌న్నీ వ‌ట్టి పుకార్లేన‌ని, ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని చెబుతున్నారు. అయితే.. మే నెలలో పెద్ద సంఖ్యలో భక్తులు షిర్డీకి రానున్నారు. ఎందుకంటే స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వులు రావ‌డంతో కుటుంబం మొత్తం షిరిడీ సాయినాథుని ద‌ర్శించుకునేలా ప్లాన్ చేసుకుంటారు. అందువల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రసాదం, చిన్నా పెద్ద బండ్లు, పండ్ల వ్యాపారుల వ్యాపారం హ్యాగా ఉండేది. కానీ, సాయి మందిరం మూతపడిందనే ప్రచారంతో ఇప్పుడు బిజినెస్ దెబ్బ‌తిని అందరూ ఆర్థికంగా నష్టపోయే ప‌రిస్థితి ఎదుర‌వుతోంది.

ఇక‌.. మే నెలలో షిడీలోని సాయి సమాధి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో షిర్డీకి భక్తుల రాక‌ తగ్గిందని సంస్థాన్ అధికారులు పేర్కొన్నారు. సాయి సంస్థాన్ పాలకవర్గం చొరవ తీసుకుని ఇలాంటి పుకార్లకు అడ్డుకట్ట వేయాల‌ని పలువురు భక్తులు కోరుతున్నారు. దేశంలోని పలు వార్తా చానళ్లు షిర్డీ సాయి ఆలయాన్ని మే నెలలో మూసివేయనున్నారనే వార్తను వివిధ భాషల్లో ప్రసారం చేశాయి. దీంతో దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. చాలా మంది భక్తులు తమ ప్ర‌యాణాల‌ను రద్దు చేసుకున్నారు.

ఈ పుకారును ఆపడానికి సాయి సంస్థాన్, పరిపాలన ప్రతి భాషలో తన వెబ్‌సైట్‌లో అప్పీల్ చేయాలన్నారు
షిరిడీ సాయి సంస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు నీలేష్ కోటే పాటిల్. ఇందుకు సాయి సంస్థాన్‌ అడ్మినిస్ట్రేషన్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ కార్యాలయం బాధ్యత వహించి వదంతులు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement