Wednesday, May 1, 2024

టైగ‌ర్3 షూట్ కంప్లీట్.. ట్వీట్ చేసిన మేక‌ర్స్

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న తాజా చిత్రం టైగ‌ర్3.ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయింద‌ని అప్ డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ఈ చిత్రానికి మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్‌ సల్మాన్‌ ఖాన్‌కు జోడీగా మరోసారి నటిస్తోండగా.. షారుఖ్‌ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే పులి గాయపడింది.. అంటూ ట్వీట్ చేసి టైగర్‌ 3 షూటింగ్‌లో బిజీగా ఉన్నట్టు హింట్ ఇచ్చారు.కాగా సల్మాన్‌ ఖాన్‌ అబుదాబి IIFA 2023 ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. టైగర్‌ 3కు సంబంధించిన తాజా అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్‌ న్యూస్‌ ప్రకారం టైగర్‌ 3 షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. దీపావళి కానుకగా టైగర్‌ 3 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. అశుతోష్‌ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్‌ బేడి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement