Saturday, October 12, 2024

NZB | ఆర్టీసీ బస్సు ధ్వంసం.. కండక్టర్ పై యువకుల దాడి

ఎడపల్లి, (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ బ‌స్సును ధ్వంసం చేసి, కండ‌క్ట‌ర్‌పై కొంత‌మంది యువ‌కులు దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఇవ్వాల (శుక్ర‌వారం) సాయంత్రం జ‌రిగింది. ఔరాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న బోధన్ డిపో బస్సు అద్దాలను ఎడపల్లి మండలం ఎంఎస్స్సి ఫారం వద్ద కొందరు పోకిరీ యువకులు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఎడపల్లి పోలీసుల సమాచారం మేరకు.. శుక్రవారం సాయంత్రం ఔరాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఏపీ 25 జెడ్ 0045 ఆర్టీసీ బస్సులో బోధన్ లో ఎడపల్లి మండలం ఎంఎస్స్సి ఫారం కు చెందిన ఓ వర్గానికి చెందిన యువకుడు ఎక్కాడు.

బోధన్ నుంచే బస్సులో కండక్టర్ మహేష్ తో చిర్రుబోర్రులాడుతున్న ఆ పోకిరి యువకుడు ఎంఎస్స్సి ఫారం కు బస్సు చేరేసరికి తమ స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. అక్కడ బస్సు అపి కండక్టర్ తో గొడవ‌కు దిగి బస్సు అద్దాలు పగులకోట్టారు. సమాచారం అందుకున్న ఎడపల్లి ఎఎస్సై ఇలియాస్, ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులతో, స్థానిక గ్రామస్తులతో జరిగిన ఘటన వివరాలిలు సేకరించారు. అనంతరం బోధన్ డిపో కంట్రోలర్ వీఎస్ రెడ్డి , బస్సు కండక్టర్ మహేష్ లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement