Friday, March 1, 2024

KNR | సమర్థవంతంగా పనిచేస్తే గుర్తింపు .. కరీంనగర్ సీపీ సుబ్బరాయుడు

సమర్థవంతంగా పనిచేసే పోలీసు అధికారులకు ఎక్కడైనా గుర్తింపు లభిస్తుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బరాయుడు అన్నారు. కరీంనగర్ కమిషనరేట్ లో పనిచేసి బదిలీపై వెళ్లిన అధికారులకు వీడ్కోలు పలుకుతూ అభినందించారు. శుక్రవారం రాత్రి కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలోని ఓపెన్ థియేటర్ ఆవరణలో వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బదిలీపై వెళ్లిన డిసిపి శ్రీనివాస్, డీసీపీ చంద్రమోహన్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయసారథి, వెంకటరెడ్డి, విజయకుమార్, సత్యనారాయణ, ఆర్ఐ మురళి, మల్లేశం, జానీమియా, ఎస్బిఐ వెంకటేశ్వర్లు లకు శాలువాలతో సన్మానించారు.

అనంతరం మాట్లాడుతూ.. గతంలో కమిషనరేట్ లో పనిచేసి బదిలీపై వెళ్లిన ప్రతి పోలీసు అధికారులు సమర్థవంతంగా పనిచేశారన్నారు. అంకితభావంతో పనిచేసే అధికారులు ఎక్కడైనా సఫలీకృతం అవుతారని చెప్పారు. నూతనంగా కరీంనగర్ కు విచ్చేసిన అధికారుల సహకారంతో రాబోవు అసెంబ్లీ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు లక్ష్మీనారాయణ, రాజు,అడిషనల్ డీసీపీ భీం, ఏసీపీలు నరేందర్, జీవన్ రెడ్డి, శ్రీనివాస్, ప్రతాప్, ఎస్బిఐ వెంకటేష్ లతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement