Saturday, April 27, 2024

RCB vs PBKS | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నా ఆర్సీబీ

ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా ఇవ్వాల (సోమవారం) జరగుతున్న‌ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ – రాయల్ చాలెంజర్స్ జట్లు తలడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జ‌ట్టు బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండగా.. మరి కొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభ కానుంది.

కాగా, ఈ సీజన్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి.. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లో అన్ని జట్లూ కనీసం ఒక మ్యాచ్ ఆడగా.. పంజాబ్ కింగ్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ రెండో మ్యాచ్ ఆడన్నాయి. సీఎస్‌కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో ఖాతా తెరవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఢిల్లీపై గెలుపొందిన పంజాబ్ రెండో మ్యాచ్‌లోనూ అదే జోరుతో విజయం సాధించాలని భావిస్తోంది.

జట్ల వివరాలు (అంచ‌నా)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డు ప్లెసిస్ (సి), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్), అనుజ్ రావత్, కర్ణ్ శర్మ/ఆకాష్ దీప్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్

పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్ (సి), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement