Saturday, May 4, 2024

Madhya Pradeshలో రోడ్డు ప్ర‌మాదాలు – తొమ్మిది మంది దుర్మ‌ర‌ణం

మధ్యప్రదేశ్: రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదాల‌లో మొత్తం తొమ్మిది మంది మ‌ర‌ణించ‌గా, మ‌రో అయిదుగురు గాయ‌ప‌డ్డారు. ముందుగా ధార్ జిల్లాలోని ధామ్‌నోద్ జాతీయ ర‌హ‌దారిపై వేగంగా దూసుకొచ్చిన ట్రైలర్ ట్రక్కు ఎదురుగా వెళ్తున్న కారును, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

మధ్యప్రదేశ్: రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదాల‌లో మొత్తం తొమ్మిది మంది మ‌ర‌ణించ‌గా, మ‌రో అయిదుగురు గాయ‌ప‌డ్డారు.. ముందుగా ధార్ జిల్లాలోని ధామ్‌నోద్ జాతీయ ర‌హ‌దారిపై వేగంగా దూసుకొచ్చిన ట్రైలర్ ట్రక్కు ఎదురుగా వెళ్తున్న కారును, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మైనర్ బాలికతో సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ధార్ జిల్లాలోని ధామ్‌నోద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుజారి గ్రామ సమీపంలో ఆగ్రా-బాంబే జాతీయ రహదారి నంబర్ 3 (రౌ – ఖల్‌ఘాట్ సెక్షన్ల మధ్య)పై గణపతి ఘాట్ వద్ద గ‌త రాత్రి ఈ ప్రమాదం జరిగింది.

ముంబై నుంచి ఇండోర్ వెళ్తున్న ట్రైలర్ ట్రక్ మొదట రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టి రాంగ్ లేన్‌లోకి ప్రవేశించింది. కారును, మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. దీనికి ముందు మరో రెండు ట్రక్కులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మోటార్‌సైకిలిస్ట్, ఇద్దరు ట్రక్కు డ్రైవర్లతో సహా ఓ కారులోని వారు మొత్తంగా ఐదుగురు సజీవ దహనమయ్యారని, ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఇప్పటివరకు, ఒక బాధితుల్లో ఒకరైన మోటారుసైకిల్‌పై ఉన్న వ్యక్తికి మన్పూర్ గ్రామానికి చెందిన జితేంద్ర జాత్ గా నిర్ధారించారు. ఇద్దరు ట్రక్ డ్రైవర్ల గుర్తింపు ఇంకా వెల్లడి కాలేదు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించ‌లేక‌పోతున్నారు.. ఇక గాయపడిన నరేష్ జాదవ్ (40), సాగూర్ గ్రామానికి చెందిన విష్ణు గైక్వాడ్ కుమార్తె అనిక (8)లను మోవ్‌, జమ్మూ నివాసి షెజ్జాద్ తన్వీర్ (30)ని ధమ్నోద్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.


కారు – ట్ర‌క్కు ఢీ…..
గునా జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగ మంచు మధ్యలో కారును ట్రక్కు ఓవర్ టేక్ చేయబోయింది. ఈ క్రమంలో ట్రక్కు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను రాజ్‌ఘర్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో భార్యాభర్తలు, వారి కూతుళ్లు ఇద్దరు ఉన్నారు. విజిబిలిటీ సరిగా లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement