Saturday, December 7, 2024

రియా చ‌క్ర‌వ‌ర్తిని వీడ‌ని డ్ర‌గ్స్ కేసు-ఎన్ సిబి ఛార్జిషీట్ లో హీరోయిన్ పేరు

బాలీవుడ్ హీరోయిన్ రియా చ‌క్ర‌వ‌ర్తి సెప్టెంబ‌ర్ లో డ్ర‌గ్స్ కేసులో అరెస్ట‌యింది. కాగా ఆమె అరెస్ట్ అయిన దాదాపు నెల తర్వాత బాంబే హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 14, 2020న బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించాడు బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. 34 ఏళ్ల చిన్న వయస్సులో ఆయన మరణం బాలీవుడ్ లో సంచలనంగా మారింది.అతను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తేల్చారు. తర్వాత బాలీవుడ్ తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం డ్రగ్స్ వినియోగంపై NCB దర్యాప్తు ప్రారంభించింది. కాగా రియా చక్రవర్తి ని డ్రగ్స్ కేసు పట్టుకుని వదలడంలేదు.2020లో మరణించిన తనప్రియుడు .. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం మాదకద్రవ్యాలను కొనుగోలు చేసినందుకు దేశ డ్రగ్స్ వ్యతిరేక ఏజెన్సీ బుధవారం అభియోగాలు మోపింది. అంతే కాదు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఆమెతో పాటు మరో 34 మందిని హైప్రొఫైల్ కేసులో నిందితులుగా పేర్కొంది. రియా చక్రవర్తి తక్కువ పరిమాణంలో డ్రగ్స్ కొనుగోలు చేసి, ఫైనాన్సింగ్ చేసినట్లు ఆమెపై అభియోగాలు మోపారు.

ఆమె సోదరుడు షోక్ చక్రవర్తిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. రియా హీరో సుశాంత్ సింగ్‌కు గంజాయిని అందజేసి డెలివరీ చేసిందని ఎన్‌సిబి తెలిపింది. ఆమె డ్రగ్స్ కోసం కొన్ని చెల్లింపులు కూడా చేసిందని వారు తెలిపారు. అయితే ఈ కేసులో రియా చక్రవర్తి దోషిగా తేలితే పదేళ్లకు పైగా ఆమెకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ విషయంలో రియా చక్రవర్తి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆమె కొట్టి పారేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గంజాయి తాగేవాడని ఆమె అంగీకరించింది, అయితే తాను డ్రగ్స్ వాడినట్లు.. వాటిని సుశాంత్ కు అందించినట్టు ఎక్కడా ఆధారాలు లేవని.. అసలు తాను ఆ పని చేయలేదని తనపై వచ్చిన ఆరోపణలను ఆమె కొట్టిపారేసింది. అంతే కాదు తాను సుశాంత్ డ్రగ్స్ తీసుకోకుండా నియంత్రించడానికి ప్రయత్నించినట్టు రియా వివరించారు. నేను నా జీవితంలో ఎప్పుడూ డ్రగ్ డీలర్‌తో మాట్లాడలేదు ..డ్రగ్స్ తీసుకోలేదు. ఈ విషయంలో నా నిజాయితీ నిరూపించుకోండం కోసం నేను రక్త పరీక్షకు కూడా రెడీగా ఉన్నాను అని ఆమె అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement