Friday, May 17, 2024

RIP – ముగిసిన సినీన‌టుడు చంద్ర‌మోహ‌న్ ప్ర‌స్థానం…పంజాగుంట‌లో అంతిమ సంస్కారాలు ..

హైద‌రాబాద్ – ఈ నెల 11న మ‌ర‌ణించిన సీనియర్ నటుడు చంద్రమోహన్ బౌతిక‌కాయానికి అంత్య‌క్రియ‌లు ముగిశాయి..ఈ రోజు హైదరాబాద్ లోని పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. నటుడు చంద్ర మోహన్ సోదరుడు దుర్గాప్రసాద్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు జరిగాయి. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు ఆశ్రనయనాల మధ్య దిగ్గజ నటుడికి అంతిమ వీడ్కోలు పలికారు.చంద్రమోహన్​ (82) కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్​నగర్​లోని నివాసంలో ఉంచారు. చంద్రమోహన్​ మృతి పట్ల యావత్​ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement