Sunday, May 5, 2024

మరింత పెరిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం.. సెప్టెంబర్‌లో 7.41 శాతం

రిటైల్‌ ద్రవ్యోల్బణం ఈ సారి మరింత పెరిగింది. సెప్టెంబర్‌ నెలలో ఇది 7.41 శాతంగా నమోదైంది. ఆగస్టులో ఇది 7 శాతంగా ఉంది. కన్జ్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌(సీపీఐ) పెరుగుదలకు ప్రధానంగా ఆహార పదార్ధాల రేట్లు పెరగడమే కారణమని కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ఆహార ద్రవ్యోల్బణం 8.6 శాతంగా నమోదైంది. సెప్టెంబర్‌లో నిర్మాణ రంగం, ఫ్యాక్టరీ ఉత్పత్తి కూడా తగ్గింది. సెప్టెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం వరకు ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇలా రిటైల్‌ ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ వేసిన అంచనాలు ఇప్పటి వరకు మూడు సార్లు తప్పాయి.

వచ్చే రెండు సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 4 శాతానికి చేరుకుంటుందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) లక్ష్యం ద్రవ్యోల్బణం 4 నుంచి 6 శాతం లోపుగా ఉండాలి. అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడంలేదు. దీని నియంత్రణకు ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు అంతగా ఫలితాలు ఇవ్వడంలేదు. మరో వైపు మన దేశ ఆర్థిక వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్‌ 6.5 శాతంగా, ఐఎంఎఫ్‌ 6.8 శాతంగా అంచనా వేశాయి. ఈ రెండు గతంలో ఇచ్చిన అంచనాలను సవరించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement