Friday, April 26, 2024

9.2 శాతం తగ్గిన విప్రో నికర లాభం.. 14.6 శాతం పెరిగిన ఆదాయం

ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో రెండో త్రైమాసికంలో నికర లాభంలో 9.2 శాతం తగ్గుదల నమోదు చేసింది. ఉద్యోగుల వేతన ఖర్చు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. జులై సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 2,659 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ 2,930 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికంలో విప్రో ఆదాయం మాత్రం 14.6 శాతం పెరిగి, 22,539.7 కోట్లుగా నమోదు చేసింది.

డాలర్‌ టర్మ్‌లో ఆదాయం 4.1 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో వచ్చిన మంచి ఫలితాలు కంపెనీ అనుసరిస్తున్న విధానం సరైనదారిలోనే ఉందని నిరూపించిందని, భవిష్యత్‌లో ఆదాయం మరింత పెరుగుతుందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ థియరీ డెలాపోర్టే చెప్పారు. ఈ త్రైమాసికంలో కంపెనీని వీడుతున్న ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 23.3 శాతం ఉంటే, ఈ త్రైమాసికంలో ఇది 23 శాతంగా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement