Saturday, May 11, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి : మంత్రి హ‌రీశ్ రావు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొనాల‌ని రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు. సోమవారం ఉదయం ప్రజాప్రతినిధులతో, పార్టీ ముఖ్యనాయకులతో మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఇటీవల రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. నేటి నుండి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి హరీష్ రావు ప్రజాప్రతినిధులకు సూచించారు. జిల్లాలో మొత్తం 412 కొనుగోలు కేంద్రాలున్నాయని, అందులో 225 ఐకేపీ, 10 మార్కెట్ కమిటీ, 187 కో ఆపరేట్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ధాన్యం ఐకేపీ, మార్కెట్ కేంద్రాల్లోకి రాబోతుందన్నారు. కాబట్టి ఎంపిపిలు, జడ్పిటిసిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, కో అపరేట్ చైర్మన్ లు, ప్రజాప్రతినిధులు వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పారు. రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. అకాల వర్షాలు కురిసిన, గాలి దుమారాలు పెట్టిన రైతులకు ఇబ్బందులు కాకుండా చూడాలని, టార్ఫలిన్ కవర్లు అందుబాటులో ఉండే విధంగా చొరవ చూపాలని కోరారు. ప్రతి రోజు ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలు సందర్శించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్కోవాలని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనాలన్నారు. ఆదిశగా ప్రజాప్రతినిధులు పని చేయాలని సూచించారు.

  • పండగల 21 ఏళ్ల పార్టీ ఆవిర్భావం..
  • ప్రతి పల్లెలో గులాబీ జెండా పండగ.. ఉత్సవాలు నిర్వహించాలి..
    సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీగా ఒక రాష్ట్రాన్ని సాధించిన, అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్న పార్టీకి 21 ఏళ్లు నిండాయని మంత్రి హరీష్ రావు గారు చెప్పారు. ఈనెల 27న టి ఆర్ ఎస్ పార్టీ 21 ఏళ్ల ఆవిర్భావం సందర్భంగా హైదరాబాద్ లో ప్లీనరీ నిర్వహిస్తున్న‌ట్లు ఈ ప్లీనరీకి ఎంపీపీ లు, జెడ్పీటీసీ లు, మున్సిపల్ చైర్మన్ లు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులకు మాత్రమే ఆహ్వానం ఉందని చెప్పారు. మిగతా పార్టీ శ్రేణులందరూ పట్టణంలోని అన్ని వార్డుల్లో వార్డు పార్టీ అధ్యక్షులు, గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షులు, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు జెండా ఎగరవేయాలని కోరారు. ప్రతి పల్లెలో గులాబీ జెండాలు ఎగరవేయాలని, పండగలా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి గ్రామ స్థాయి నుండి పార్టీ శ్రేణులు, పార్టీ కమిటీలు, అనుబంధ కమిటి సభ్యులంద‌రూ పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయలని సూచించారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement