Thursday, May 2, 2024

చిన్న‌త‌నంలో లైంగిక వేధింపుల‌ని గుర్తు చేసుకున్న కంగ‌నార‌నౌత్

చిన్న‌ప్ప‌టి విష‌యాల‌ను పంచుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్. త‌న కంటే పెద్ద వ్య‌క్తి త‌న‌ని చిన్న వ‌య‌సులో అస‌భ్యంగా తాకాడ‌ని వెల్ల‌డించింది. ఓటీటీ షో లాక‌ప్ కి హోస్ట్ గా చేస్తోంది కంగ‌నా. ఈ షోలో ప‌లు విష‌యాలు పంచుకుంది. చిన్న‌త‌నంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బ‌య‌ట‌పెట్టారు. చాలా మంది చిన్నారులు ఇలాంటి వేధింపుల‌కు గుర‌వుతుంటారు..బ‌హిరంగ వేధిక‌పై వీటిని చ‌ర్చించేందుకు మ‌నం వెనుకాడుతుంటామ‌ని కంగ‌నా తెలిపింది. మ‌నమంద‌రం ఏదో ఒక స‌మ‌యంలో అభ్యంత‌ర‌క‌రంగా తాక‌డం వంటి వేధింపులు ఎదుర్కొని ఉంటాం..నా చిన్న‌త‌నంలో మా స్వ‌స్ధ‌లంలో ఓ బాలుడు త‌న‌ను అభ్యంత‌ర‌క‌రంగా తాకాడ‌ని, ఆ స‌మ‌యంలో దాని గురించి త‌న‌కు తెలియద‌ని అన్నారు. ఇలాంటి సున్నిత‌మైన అంశాల గురించి మాట్లాడేందుకు ఈ షోను వేదిక‌గా ఎంచుకున్నామ‌ని వివ‌రించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement