Monday, May 20, 2024

ముంపు గ్రామాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు.. పున‌రావాస కేంద్రాలకు వేలాది మంది త‌ర‌లింపు

గోదావ‌రి నదికి గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా వ‌ర‌ద‌లు వ‌స్తున్నాయి. వందేండ్ల కాలంలో ఇట్లాంటి ఫ్ల‌డ్స్ ఎప్పుడూ చూడ‌లేద‌ని చాలామంది చెబుతున్నారు. అయితే.. గోదావరి వరద ముంపున‌కు గురైన చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం, కొత్తగూడెం మండలాల్లో అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇళ్లలోకి వరద చేరడంతో 45 గ్రామాలకు చెందిన 1,232 కుటుంబాల 4,080 మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి వెంట‌నే సంరక్షణ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

అలాగే ఏడు వరద ముంపు మండలాల్లోని 1,530 పశువులను, 4,208 మేకలు, గొర్రెలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. పశువుల సంరక్షణ చర్యలను పర్యవేక్షణ చేసేందుకు పశు సంవర్ధక అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. అత్యవసర సమయంలో సహాయక చర్యలు కోసం అదనంగా ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమును తెప్పించి రెడీగా పెట్టామ‌ని ఆయన వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement