Friday, May 3, 2024

సందీప్ కిష‌న్ తో రెజీనా సెల్ఫీ.. రూమ‌ర్స్ నిజ‌మేనా..!

న‌టీన‌టులు సందీప్ కిష‌న్ ..రెజీనా డేటింగ్ లో ఉన్నార‌ని రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. గతంలోనే వీరిద్దరూ క్లోజ్ గా మూవ్ అవుతున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా మళ్లీ వీరి ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఓ ఫొటో కూడా నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్ గా రెజీనా కసాండ్రా పుట్టిన రోజు వేడుకులను గ్రాండ్ గా జరిగాయి.

ఈ సందర్భంగా సందీప్ కిషన్.. రెజీనాకు చాలా దగ్గరి వ్యక్తిలాగా విష్ చేస్తూ ఓ సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే పాప. లవ్ యూ. అన్ని విషయాల్లో ఎప్పుడూ నీకు మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటుగా రెజీనాతో సందీప్ క్లోజ్ గా ఉన్న ఫొటోను షేర్ చేశాడు.ఈ ఫొటోలో రెజీనా కూడా సందీప్ తో చనువుగా కనిపించింది. ఈక్రమంలో వీరిద్దరూ డేటింగ్ నిజమే అంటూ నెట్టింట రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. పొగలేనిదే మంట రాదనే తీరుగా వీరి ప్రేమ వ్యవహారంపై ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement