Thursday, April 25, 2024

జీరో కట్స్ తో.. 18పేజెస్ చిత్రానికి.. యూ/ఏ సర్టిఫికెట్

సూర్య‌ప్ర‌తాప్ ప‌ల్నాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం 18పేజెస్.ఈ చిత్రంలో నిఖిల్..అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టిస్తున్నారు.ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం సెన్సార్ ప‌నుల‌ను పూర్తి చేసుకుంది. జీరో కట్స్ తో యూ/ఏ సర్టిఫికెట్ ను పొందింది. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేస్తూ ప్రకటించారు. దీంతో క్రిస్టమస్ కు పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్చర్ గా ‘18 పేజెస్’ నిలుస్తుందని తెలుస్తోంది. రొమాంటిక్ డ్రామా చిత్రం ఇది. వరుస హిట్ సినిమాలను అందిస్తూ ‘జీఏ 2’ పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథ అందించగా.. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. రిలీజ్ కు ఇంకా ఏడు రోజులే సమయం ఉండటంతో సినిమాను మరింత జోరుగా ప్రమోట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement